పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటికే విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీ లలో ఖుషి సినిమా ఒకటి. ఈ మూవీ అప్పట్లో బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీ లో భూమిక చావ్లా , పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ లో వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ కి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ కి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విజయంలో మణిశర్మ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ అయిన ఖుషి రీ రిలీజ్ మరో సారి హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో , నిర్మాత ఏ ఎమ్ రత్నం మాట్లాడుతూ ఖుషి మూవీ రిలీజ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఖుషీ రీ మాస్టర్డ్ వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నాను.  కాకపోతే తమ్ముడు ,  జల్సా మూవీ లను  ఇప్పటికే ప్రత్యేక షో లను ప్రదర్శించినందున ఖుషి మూవీ ని తిరిగి విడుదల చేసే ఆలోచనను విరమించుకున్న విషయాన్ని ఏ ఎమ్ రత్నం తాజాగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పుట్టిన రోజు కి ఖుషి మూవీ ని ప్రత్యేక విడుదలను కలిగి ఉండవచ్చని కూడా ఏ ఎమ్ రత్నం  పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: