మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు మూవీ లకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్  ప్రస్తుతం మాత్రం వరుస పెట్టి మూవీ లను ఓకే చేస్తూ వస్తున్నాడు . అందులో భాగంగా అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటికే అజ్ఞాతవాసి , భీమ్లా నాయక్ మూవీ లను పూర్తి చేసి విడుదల కూడా చేశాడు .

ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి . అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో నీది అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ సెట్స్ పై ఉండ గానే పవన్ కళ్యాణ్ తమిళ మూవీ వినోదయ సీతం రీమిక్ లో నటించ డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . అలాగే హరీష్ శంకర్ దర్శకత్వం లో భవదీయుడు భగత్ సింగ్ మూవీ లో నటించడానికి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒకే చెప్పేశాడు . అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వం లో కూడా పవన్ కళ్యాణ్ ఒక మూవీ లో నటించడానికి రెడీ గా ఉన్నాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మరో క్రేజీ దర్శకుడు మూవీ కి కూడా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పెరకెక్కిన సాహో అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: