తమిళ విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న కోబ్రా చిత్రంతో ప్రేక్షకులను ఇటీవలే అలరించాడు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని ఆయన విడుదల చేయగా విలక్షణ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమా కి దర్శకత్వం వహించాడు. సినిమా కి ముందు వచ్చిన అప్డేట్ లు సినిమా పై అంచనాలను భారీ స్థాయి లో పెంచాయి. ట్రైలర్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా అందరిలో మంచి అంచనాలను ఏర్పరిచింది అని చెప్పొచ్చు.

దానికి తోడు ఇటీవలే తమిళ హీరోలు నటించిన సినిమాలకు మంచి పేరు వస్తుంది. వారి సినిమా లకు భారీ భారీ విజయాలు వస్తున్నాయి. కమల్ హసన్ కు మంచి హిట్ వచ్చింది. కమల్ కి విక్రమ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా ఇప్పుడు వచ్చిన విక్రమ్ సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుందని అందరు భావించారు. తమిళనాడు లో మాత్రమే కాదు తెలుగు లో కూడా మంచి పేరు ను కలిగి ఉన్నాడు ఈ హీరో. శివ పుత్రుడు సినిమా  మొదలుకొని అప్పటినుంచి తన అన్ని సినిమాలను తెలుగు లో విడుదల చేస్తూ వచ్చాడు.

ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు.  అయితే కొన్ని సార్లు  ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది కూడా అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఇప్పుడు ఆయన ప్రయోగాత్మక సినిమాగా కోబ్రాని చేశాడు. ఈ సినిమా లో ఈ హీరో మ్యాథ్స్ టీచర్ గా చేయగా. మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ స్థాయి లో ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ సినిమా కి ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఇప్పటికే వచ్చిన పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా కి అయితే పెద్దగా ప్రేక్షకులు చూడడానికి ఇష్టం చూపించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: