తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా వైష్ణవ్ తేజ్ తన కెరియర్ లో మూడవ మూవీ గా రంగ రంగా వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిగా , గిరిశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రంగ రంగ వైభవంగా మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 78 లక్షలు .
సీడెడ్ : 22 లక్షలు .
యూ ఏ : 29 లక్షలు .
ఈస్ట్ : 20 లక్షలు .
వెస్ట్ : 14 లక్షలు .
గుంటూర్ : 26 లక్షలు .
కృష్ణ : 19 లక్షలు .
నెల్లూర్ : 12 లక్షలు .
3 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగ రంగ వైభవంగా మూవీ 2.20 కోట్ల షేర్ , 3.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 15 లక్షలు .
ఓవర్ సీస్ లో : 40 లక్షలు .
మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రంగ రంగా వైభవంగా మూవీ : 2.75 కోట్ల షేర్ , 5.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: