మహానటి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన దుల్కర్ సల్మాన్ తాజాగా సీతా రామం అనే మరో తెలుగు మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా , హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ లపై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. 

మూవీ ఆగస్టు 5 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడంతో ఈ మూవీ ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు 31 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 

నైజాం : 9.81 కోట్లు , సీడెడ్ : 1.92 కోట్లు , యూ ఏ : 3.53 కోట్లు , ఈస్ట్ : 1.96 కోట్లు , వెస్ట్ : 1.26 కోట్లు , గుంటూర్ : 1.60 కోట్లు , కృష్ణ : 1.76 కోట్లు , నెల్లూర్ : 90 లక్షలు . 31 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 22.74 కోట్ల షేర్ , 40.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 2.84 కోట్లు . ఇతర భాషలలో :  8.10 కోట్లు . ఓవర్ సీస్ లో : 7.12 కోట్లు . నార్త్ ఇండియాలో : 1.10 కోట్లు . 31 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 41.90 కోట్ల షేర్ , 85.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: