టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న తెలుగు సినిమాలు ఏంటి అంటే ఏ సినిమా అనేది చెప్పడం కష్టం. ఆమె నటించబోయే తెలుగు సినిమాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆమె చేస్తున్న తెలుగు సినిమా ఏదో ఎవరికి తెలియదని చెప్పాలి. తాజాగా ఆమె బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబో లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిచుందని కొంతమంది చెబుతున్నారు.

కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇంకొక వైపు బాలీవుడ్ లో ఆమె సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ లో కూడా విజయ్ సరసన ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమా పరిశ్రమలలో ఆమె హీరోయిన్ గా నటిస్తూ సినిమాలను చేస్తుంది కానీ తెలుగులో హీరోయిన్ గా చేసే సినిమా ఇప్పటిదాకా ఓకే అవ్వలేదని చెప్పాలి. దానికి కారణం ఏంటో తెలియదు కానీ తెలుగు సినిమా పరిశ్రమ ద్వారానే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అలాంటి ఈ సినిమా పరిశ్రమ లోని సినిమాలను పక్కన పెట్టి వేరే సినిమా పరిశ్రమలలో వరుస సినిమాలు చేయడం ఆమె అభిమానులను ఎందుకో భారీ స్థాయిలో నిరాశ పరుస్తుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత తెలుగు సినిమా పరిశ్రమలలో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే మంచి స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ లోకి కూడా వెళ్లిపోయి అక్కడ కూడా మంచిగా అవకాశాలను అందుకుంటుంది. చూడబోతే ఇప్పుడు అన్ని భాషలలో ఉన్న హీరోయిన్ రష్మిక మందన అనే చెప్పాలి. త్వరలోనే రష్మిక మందన తెలుగులో మరొక సినిమాను ఒప్పుకుంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ సినిమా ఏంటో ఎప్పుడు ఆ సినిమా అధికారికంగా మొదలవుతుందో చూడాలి. పుష్ప సినిమా కు ఆమె వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: