ఇటీవల కాలంలో తెలుగు సినిమాలలో వయోలెన్స్ఎక్కువగా కనిపిస్తుంది అన్న విమర్శ కొంతమంది సినిమా విశ్లేషకుల దగ్గర నుంచి వినబడుతుంది. ఒకప్పుడు వైలెన్స్ సినిమాలు అంటే ఒకటో రెండో ఫైట్లు ఉండేవి కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే వయోలెన్స్ లో ఫైట్స్ పేర్లు చెప్పి నరుక్కోవడం రోజు రోజుకు ఎక్కువైపోతుంది అనే విమర్శ కలుగుతుంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలో ఇది ఎక్కువగా కనిపిస్తుందట.

ఆయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుంది.  ఆ సినిమా ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ ఇప్పటికే వచ్చిన పోస్టర్ లు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ సినిమా ఎంతటి స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించినదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాహుబలి రికార్డులను సైతం ఈ సినిమా కొల్లగొట్టగా ఇప్పుడు చేస్తున్న ప్రభాస్ సినిమా అంతకుమించి ఉండేలా చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఆ క్రమంలోనే ఈ సినిమా తర్వాత ఆయన దేశంలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడుగా ఎదగడం ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఇందులో వాయిలెన్స్ మోతాదుకు మించిన స్థాయిలో ఉంటుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇటీవల ఈ సినిమా బృందం అనే ఒక హింటును కూడా ఇవ్వడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే యడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా అలరించడానికి సిద్ధమవుతుంది. మరి మాస్ ను టార్గెట్  చేస్తూ చేసిన ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఊర మాస్ లెవెల్ లో ఈ సినిమా కి భారీ స్థాయి లో అంచనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: