కొత్తగా వచ్చే వారికి సినిమా పరిశ్రమలో ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలను ఒప్పుకోవాలి అన్న విషయంపై కొంత అనుభవం తక్కువగా ఉంటుంది వారు మంచి విజయాన్ని అందుకునే సినిమాను ఎంపిక చేసి ఎంచుకుంటే తప్పా వారికీ కెరీర్ ఉండదు. అందులోనూ హీరోయిన్ లు ఎంతో జాగ్రతగా సినిమాలను ఎంపిక చేసుకుని ముందుకు పోవాలి. లేదంటే ఈ కాంపిటిషన్ ఇండస్ట్రీ లో వారు ముందుకు వెళ్ళలేరు. హిట్స్ కొట్టే విధంగా వారి కెరీర్ లేకపోతే మాత్రం హీరోయిన్ లు ఎక్కువ రోజు లు ముందకు సాగదనే చెప్పాలి. అలా ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న కొంతమంది హీరోయిన్ తప్పటడుగులు వేయడం దేనికి దారితీస్తుందో చూడాలి.

ఉప్పెన సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని తన ఖాతా లో వేసుకుంది హీరోయిన్ కృతి శెట్టి. తో సినిమా తో ఇంతలా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ అవడం గ్యారెంటీ అనుకున్నారు. అందరు అనుకున్నట్లుగానే ఈమెకు వరుస విజయాలు వచ్చి మంచి క్రేజ్ ఉన్న నటిగా ఎదగడం మొదలుపెట్టింది. వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో లక్కీ హీరోయిన్ గా అవతరించింది. అందరి హీరోల కళ్ళు కూడా ఆమెపై పడ్డాయి. అయితే తాజాగా ఆమె నటించిన ఒక సినిమా ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా అంతా తలకిందులు అయ్యింది. ఆమెను పొగిడిన నోల్లె విమర్శలు చేస్తున్నాయి.

అలా ఆమె ఇప్పుడు మళ్ళీ విజయపు బాట పట్టాలంటే హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో యువ హీరోయిన్ కేతిక శర్మ టాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. చేసిన మూడు సినిమాలతో ఫ్లాప్ లు ఎదుర్కుని అందరిని నిరాశ పరిచింది. ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అని చెప్తూ విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శల మధ్య ఈ ముద్దుగుమ్మ మరో సినిమా ను ఒకే చేసుకుంటుందా అనేది చూడాలి. ఇకపోతే మరో యువ హీరోయిన్ శ్రీ లీల తొలి సినిమా తో ఫ్లాప్ అందుకున్నా కూడా తన లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ క్రమంలో ఆమెకు ఇప్పుడు ఓ పెద్ద సినిమా చేస్తుంది. ఆ సినిమా హిట్ అయితే తప్పకుండ ఈమెకు మంచి అవకాశాలు రావడం ఖాయం. మరి ఆమె హిట్ కొడుతుందా అనేది చూడాలి. త్వరలోనే వీరి ముగ్గురి లో ఎవరు పెద్ద సినిమాలు చేస్తారో తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: