తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా లతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న కుర్ర హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రానివారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ కుర్ర హీరో ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం , సెబాస్టియన్ , సమ్మతమే వంటే మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించు కున్నాడు. ప్రస్తుతం  కూడా ఈ హీరో అనేక మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఈ హీరో తాజాగా నేను మీకు బాగా కావలసిన వాడిని అనే మూవీ లో  హీరోగా నటించాడు. ఈ మూవీ కి శ్రీధర్ గాడే దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాక పోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తాజాగా ప్రకటించింది. మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ని సెప్టెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బంధం ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఈ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: