దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వం లో తాజాగా సీతా రామం అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు . ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ,  సుమంత్ , భూమిక చావ్లామూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రలో నటించారు . ఈ మూవీ ఆగస్టు 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది . ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి వసూలను రాపడుతుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సీతా రామం మూవీ మరి కొన్ని రోజుల్లో  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి రాబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా వెలువడింది. సీతా రామం మూవీ ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తాజాగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన సీతా రామం మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: