తమిళ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న కార్తి 'యుగానికి ఒక్కడు' మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా కార్తీ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కార్తీ నటించిన ఎన్నో తమిళ మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేశాడు. అందులో కొన్ని కార్తీక్ నటించిన ఆవారా ,  నా పేరు శివ ,  ఖాకి వంటి మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సాధించాయి.

ఇలా కార్తీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ , రాజు మురుగన్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కి జపాన్ అనే టైటిల్ ని చిత్ర బృందం ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మూవీ లో కార్తీ విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో తెలుగు ఇండస్ట్రీ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. కార్తీ ప్రస్తుతం పోనియన్ సెల్వన్ ,  సర్దార్ మూవీ లలో నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సర్దార్ మూవీ లో కార్తీ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: