టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు. ఈయన గత కొంతకాలంగా ఇటు సినిమాలను అటు రాజకీయాలను రెండింటినీ బాలన్స్ చేసుకుంటూ వెళుతున్నాడు. అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలను మానేస్తారు అన్న ప్రశ్నకు లేదు రాజకీయాల్లో కొనసాగాలంటే డబ్బు అవసరం అందుకే సినిమాలు కూడా చేస్తుంటాను అని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ ను పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతల సంగతి కూడా అయోమయంగా ఉంది. డేట్స్ ఇచ్చాక వరుసగా షూటింగ్ జరిగి సినిమా అయిపోతే నిర్మాతకు ప్రశాంతత ఉంటుంది.

అలా కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే నిర్మాతకు ప్రశాంతత ఉండదు. ఇప్పుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి అదే... ఎప్పటి నుండో ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది..మధ్యలో బ్రేకులు వస్తున్నాయి.. కానీ ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది క్లారిటీ లేదు. ఇది కాకుండా ఇంకా కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి... హరీష్ శంకర్ తో ఒకటి, సురేందర్ రెడ్డి తో ఒకటి, తమిళ్ రీమేక్ ఒకటి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు మొదలు అవుతాయన్నది క్లారిటీ లేదు.

కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే పవన్ కళ్యాణ్ కు అంత సమయం లేదు. జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఈయన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి నిత్యం ఏదో ఓకే కార్యక్రమంతో బిజీ గా ఉన్నాడు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బిజీ బిజీగా పార్టీ తరపున ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు, పార్టీ మేనిఫెస్టో పై వర్క్ చేయడం , కమిటీలు చేయడం, జిల్లాల బాధ్యతలను అప్పగించడం వంటి ఎన్నో పనులు పవన్ ముందు ఉన్నాయి. కాబట్టి ఇక సినిమాల సంగతి ఎన్నికల తర్వాతనే అని ఫిక్స్ అవ్వాల్సిందే. అయితే ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాల గురించి ఏమి చెయ్యాలో అన్నది పవన్ కు అంతుబట్టడం లేదు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: