రాశీ ఖన్నా గురించి పెద్ద ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు తమిళ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఆకట్టుకునే నటన మైమరపించే అందంతో చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా నిరూపించుకుంది ఈ హాట్ బ్యూటీ.అయితే ఈ బ్యూటీ గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఢిల్లీ బ్యూటీ నుంచి చివరిగా వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' 'పక్కా కమర్షియల్' 'థ్యాంక్యూ' చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యి బొక్క బోర్లా పడ్డాయి.ఈ చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాశి ఖన్నాకి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఆమె గ్రాఫ్ సైతం పూర్తిగా డౌన్ అయిపోవడంతో.. ఇక ఆఫర్లు రావడం కష్టమే అని చాలా మంది భావించారు. కానీ వరుస ఫ్లాపుల్లోనూ రాశి ఖన్నాను టాలీవుడ్ హీరోలు వదలి పెట్టడం లేదు. తాజాగా ఈ బ్యూటీ  శర్వానంద్ కు జోడీగా నటించే అవకాశాన్ని అందుకుంది. శర్వానంద్ హీరోగా రూపొందిన 'ఒకే ఒక జీవితం' సినిమా.. ఈ నెల 9వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా అమల అక్కినేని రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే శర్వానంద్ మరో మూవీని పట్టాలెక్కించాడు.


కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇందులో రాశి ఖన్నా శర్వాకు జోడీగా అలరించబోతోంది. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. సోమవారం హైదరాబాద్లో ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శర్వా రాశి ఖన్నాలపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా.. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయనున్నారు.పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతోందని రాశి ఖన్నా పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా రాశి ఖన్నా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? లేదా? అనేది చూడాలి. ఇకపోతే రాశి ఖన్నా తమిళంలో 'సర్దార్' అనే మూవీతో పాటు హిందీలో 'యోధ' అనే సినిమాలో నటిస్తోంది. ఇవి రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇలా రాశీ ఖన్నాకు సినిమాలు ప్లాపైన సినిమా ఛాన్స్ లు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: