గత కొంత కాలం నుంచి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతోంది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ చూపు మొత్తం కూడా `బ్రహ్మాస్త్ర` సినిమాలు పైనే ఉంది.హిందీలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌, మౌనీ రాయ్‌, కింగ్ నాగార్జున తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఓ విజువల్ వండర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 9న హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ నార్త్ తో పాటు సౌత్ లోనూ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ఈ సినిమాను చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.`బ్రహ్మాస్త్ర అన్ని విధాలుగా పెద్ద సినిమా, పెద్ద స్టార్స్, పెద్ద కాన్వాస్, ఎస్ఎఫ్ కోసం భారీ ఖర్చు. భారీగా ప్రమోషన్స్.


భారీ అంచానాలు. కానీ, బాధాకరం ఏంటంటే ఈ భారీ అంచనాలే నిరుత్సాహపరిచాయి. బ్రహ్మాస్త్రానికి సోల్ లేదు. మెరుస్తున్నదంతా బంగారం కాదు అని బ్రహ్మాస్త్ర నిరూపించింది. బాలీవుడ్లో ఫాంటసీ, అండ్వెంచర్ సినిమాలు చాలా అరుదు. ఒక అద్భుతమైన ఊహా లోకాన్ని సృష్టించిన అయాన్ ముఖర్జీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.కానీ, బ్రహ్మాస్త్రం సినిమా స్క్రీన్ప్లే, కథ పూర్తి యావరేజ్గా.. అలాగే కొన్నిసార్లు గందరగోళంగా ఉన్నాయి. ఈ చిత్రంలో రణబీర్ చాలా కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తాడు. అయితే అలియా భట్‌, మౌనీ రాయ్ మాత్రం అదరగొట్టేశారు. అమితాబ్ నటన ఎప్పటిలాగానే చాలా అద్భుతంగా ఉంది, అయితే, ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండటం విచారకరం` అని రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు 2.5 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఇక ఈయన రివ్యూతో నెటిజన్లు `బ్రహ్మాస్త్ర`సినిమాపై సైతం బాలీవుడ్ ఆశలు వదులుకోవాల్సిందే అంటూ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: