తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత ఎంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా ఈమె నటనతో అందంతోనే ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించుకున్నదని చెప్పవచ్చు.. ఇక తెరపై నవ్వుతూ ఎంతో అందంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తెర వెనక కూడా చాలా కష్టాలను ఎదుర్కొన్నట్లు సమాచారం. సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల తరచూ అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయని చెప్పవచ్చు ఈ విధంగా ఇప్పటికీ ఎంతోమంది ఇండస్ట్రీలోని నటీనటుల సైతం పలు సమస్యలతో ఇబ్బంది పడ్డవారు ఉన్నారు. ఇప్పుడు సమంత ఎలాంటి వ్యాధితో ఇబ్బంది పడింది అనే విషయంపై తెలుసుకుందాం.


ఇక సమంత గతంలో ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉండేదట. అది ఏమిటంటే సమంతకు బయట సూర్యరశ్మి తగిలిందంటే చాలు ఆమె శరీరం అంత మంటలు లాగా అనిపించేదట,లేదంటే శరీరం మొత్తం దద్దుర్లు లాగా రావడం జరుగుతూ ఉండేదట. ఈ వ్యాధిని పాలిమార్పస్ లైట్ అని కూడా అంటారు. ఈ వ్యాధి కి చికిత్స చేయించుకొని సమంత ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నది. ఈ వ్యాధి సమయంలో మాత్రం సమంత చాలా ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొని బయటపడింది సమంత.


ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం సినిమాల్లో నటిస్తూ ఉన్నది. ఇక నాగచైతన్యాన్ని ప్రేమించి వివాహం చేసుకున్న సమంత కొన్ని కారణాల చేత గత ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో వీరిద్దరూ ఎక్కువగా సినిమాల పైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం సమంత శాకంతలం, యశోద, ఖుషి వంటి చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నది. ఇక అంతే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: