తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్బాస్ 6వ సీజన్ ప్రారంభమైంది.  ఈ క్రమంలోనే ప్రతి రోజు కూడా బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తూ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ పొందడం స్టార్ట్ చేశారు బుల్లితెర ప్రేక్షకులు. ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతోమంది ప్రేక్షకులకి తెలిసిన కంటెస్టెంట్స్  ఎంట్రీ ఇచ్చారు అని చెప్పాలి. అయితే సాధారణంగా బిగ్ బాస్ లోకి ఎవరు వచ్చినా కూడా ఈ షో ద్వారా బాగా ఫేమస్ అయి ఇండస్ట్రీలో అవకాశాలు పొందడం కోసం రావాలి అని భావిస్తూ ఉంటారు.


ఇక అప్పటికే ఒకవేళ ఇండస్ట్రీలో బాగా రాణించి ఉంటే తమను తాము ప్రేక్షకులకు నిరూపించుకునేందుకు బిగ్బాస్ కార్యక్రమానికి వచ్చాము అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవలే ప్రసారమవుతున్న ఆరో సీజన్లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి వెనుక కారణం దీంతో చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అందరూ తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చామని అందరూ చెప్పారు. కానీ నాలుగవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నేహా చౌదరి మాత్రం షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.



స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కారణంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు యాంకర్ గా వ్యవహరించింది నేహా చౌదరి. బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేసిందనే చెప్పాలి. అయితే నేహా చౌదరి బిగ్బాస్ వేదికపైకి రాగానే తనతో నాగార్జున మాట్లాడుతూ బిగ్బాస్ హౌస్ కి రావడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. నేహా చౌదరి సమాధానం చెబుతూ.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. పెళ్లి చేసుకో అంటూ తన తల్లి తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తోందని తెలిపింది. పెళ్లి ప్రస్తావన వచ్చిన సమయంలో బిగ్ బాస్ అవకాశం రావడంతో పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసమే బిగ్బాస్ కార్యక్రమానికి వచ్చాను అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది స్నేహ చౌదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: