అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మకు గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయం దక్కలేదు.

కొంతకాలం క్రితం విడుదల అయిన ప్రతిరోజు పండగ మూవీ తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఆఖరి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాశి కన్నా , విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రాశి ఖన్నా ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. అందులో మొదటగా పక్కా కమర్షియల్ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

అలాగే జూలై నెలలో రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన థాంక్యూ మూవీ విడుదల అయ్యింది. ఈ మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇలా వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటించబోతుంది. ఈ మూవీ తప్ప రాశి కన్నా ప్రస్తుతం మరే తెలుగు మూవీ లో నటించడం లేదు. మరి ఈ మూవీ తో అయిన ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని సాధించి మళ్లీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తుందో ... లేదో ... చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: