బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో హిట్ ,  సూపర్ హిట్ ,  బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి బాలీవుడ్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న బిగ్ బి అమితా బచ్చన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కూడా బిగ్ బి అమితా బచ్చన్ అనేక మూవీ లలో అనేక ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అమితా బచ్చన్ అనేక తెలుగు మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలంకరించాడు.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీ లో అమితా బచ్చన్ , చిరంజీవి కి గురువు పాత్రలో నటించాడు  భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీ అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బి అమితా బచ్చన్ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే భారీ బడ్జెట్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ లో తన పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ చెప్పు కొచ్చాడు. ప్రాజెక్ట్ కే మూవీ లో నా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని,  సినిమా వచ్చినప్పుడు మీరంతా షాక్ అవుతారు అని అమితా బచ్చన్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీలో తనపై చాలా మేకప్ ఉపయోగించబడుతుంది అని, సినిమా షూటింగ్ రెడీ కావడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది అని అమితా బచ్చన్ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: