సినిమా పరిశ్రమలో కొంతమంది దర్శకులకు ఏ విధమైన డిమాండ్ ఏర్పడుతుంది అంటే ప్రతి ఒక్క హీరో కూడా ఆ దర్శకుడుతో సినిమా చేయాలని కోరుతూ ఉంటారు కానీ ఆ దర్శకుడు ఒక్కసారి ఒక హీరోతో మాత్రమే చేస్తూ ఉంటాడు కాబట్టి ఒకరి తర్వాత ఒకరితో ఆయన సినిమా చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక దర్శకుడు కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆయన తో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరతుంది.

ఆయన ఎవరో కాదు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన దర్శకుడు. ఈ దర్శకుడు తెలుగులో హీరోల అందరితో సినిమా ఎప్పుడు చేస్తాడో తెలియదు కానీ మన హీరోలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆయనతో సినిమా చేసే విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇటీవల విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించిన దర్శకుడైన లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయడానికి మన అగ్ర హీరోలు కడుతున్నారు.

ఆ సినిమాను ఆయన రూపొందించిన విధానానికి ప్రేక్షకులు దాన్ని స్వీకరించిన విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. అందుకే ఇలాంటి దర్శకుడుతో సినిమా చేస్తే తప్పకుండా విజయం అందుకుంటుందని భావించి ఆయనతో సినిమా చేయడానికి మన హీరోలు క్యూలు కడుతున్నారు అని చెప్పాలి. అయితే లోకేష్ చేతిలో ఇప్పుడు పలు సినిమాలు ఉన్నాయి. విక్రమ్ 2, ఖైదీ2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. అంతేకాదు విజయ్ దళపతి తో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఇన్ని సినిమాలు ఉన్న నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమలోని హీరోలను వదిలిపెట్టి ఆయన తెలుగు సినిమా చేయడం ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. రామ్ చరణ్ విజయ్ దేవరకొండ వంటి హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరి వీరిలో ఎవరితో సినిమా చేస్తాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: