మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు మూడు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో రెండు సినిమాల షూటింగ్ లు ఇప్పటికే పూర్తయ్యాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇంకొక సినిమా యొక్క షూటింగ్ జరుగుతుంది. రవితేజ మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ను నిర్ణయించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క యాక్షన్ ఘట్టాలు ఇప్పుడు రూపొందుతున్నాయి.

ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమాను దసరాకే విడుదల చేయాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సినిమా యొక్క టీజర్ లో వెల్లడించారు కూడా. ఆచార్య లాంటి భారీ ఫ్లాప్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దసరాకు ఇంకా ఒక్క నెల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతాయని ప్రతి ఒక్కరు కూడా ఆశించారు.

కానీ ఈ సినిమా నుంచి ఏ ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడం ఈ సినిమా నిజంగా దసరాకి విడుదల అవుతుందా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార సత్యదేవ్ కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో చేస్తూ ఉండటం ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి సినిమాపై హైట్ బాగా తేవాలని మెగా అభిమానులు చిత్ర బృందానికి సూచిస్తున్నారు. మరి దసరాకు విడుదల అనుకున్న నేపథ్యంలో వారు ఇప్పటి నుంచే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచాలని అందరూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: