కొంతమంది హీరోలకు ఎంత ఖర్చు చేసినా కూడా అది రిటర్న్ వస్తుంది అన్న నమ్మకం నిర్మాతలకు ఉంటుంది. ఇంకా కొంతమంది హీరోలకు ఖర్చు చేయకుండా మినిమం బడ్జెట్లో చేసి ఆ సినిమా ద్వారా లాభాలను పొందుతూ ఉంటారు. ఇంకా ఇటీవల కాలంలో వచ్చిన నిర్మాతలు రిస్క్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఒక హీరోకి ఉన్న మార్కెట్ కు మించిన బడ్జెట్ను పెట్టి దాని ద్వారా మంచి లాభాలను రాబట్టుకునే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు. అందుకే కథ విషయంలో దర్శకుడు విషయంలో ఎంతో పక్కాగా ఉంటూ వారు సినిమాలను నిర్మిస్తున్నారు.

ఆ విధంగా చిట్టూరి సిల్వర్ స్క్రీన్ అధినేత చిట్టూరి శ్రీనివాస్ ఇటీవల కాలంలో మంచి సినిమాలను రూపొం దిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తాజాగా వారియర్ సినిమాతో అలరించిన ఈ నిర్మాత ఇప్పుడు నాగచైతన్య హీరోగా మరొక సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు. తమిళంలో విలక్షణ దర్శకు డిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య ఇప్పుడు ఒక ద్విభాష చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే 

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలయింది. కృతి శెట్టి నటిస్తున్న ఈ సినిమా ఎప్పటిలాగే సరికొత్త కథా కథనాలతో రూపొందుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం నిర్మాత నాగచైతన్య మార్కెట్ను మించి డబ్బు ఖర్చు చేయబోతున్నాడట. దాంతో కొంతమంది సినిమా విశ్లేషకులు ఈ నిర్మాతహీరో కోసం కొంత రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. మరి రిస్క్ చేయనిదే ఫలితం ఉండదని భావిస్తున్న చాలామంది లాగే ఆయన కూడా ఈ సినిమా కోసం కొంచెం ఎక్కువ రిస్క్ చేస్తున్నాడని చెప్పవచ్చు. మరి నాగచైతన్యసినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకొని నిర్మాతకు కాసుల పంట పండిస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: