తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి , తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన కార్తికేయ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహించగా ,  కలర్స్ స్వాతిమూవీ లో హీరోయిన్ గా నటించింది. అలా కార్తికేయ మూవీ మంచి విజయం సాధించడంతో తాజాగా కార్తికేయ మూవీ కి సీక్వల్ గా కార్తికేయ 2 మూవీ ని తెరకెక్కించారు  ఈ మూవీలో నిఖిల్ హీరోగా నటించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 12.86 కోట్లు .
సీడెడ్ : 4.84 కోట్లు .
యూ ఏ : 4.39 కోట్లు .
ఈస్ట్ : 2.56 కోట్లు .
వెస్ట్ : 1.63 కోట్లు .
గుంటూర్ : 2.70 కోట్లు .
కృష్ణ : 2.22 కోట్లు .
నెల్లూర్ : 1.09 కోట్లు .
25 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 మూవీ 32.29 కోట్ల షేర్ , 54.00 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 2.85 కోట్లు .
ఓవర్ సీస్ లో :  6.37 కోట్లు .
నార్త్ ఇండియాలో :  14.20 కోట్లు .
25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 55.71 కోట్ల షేర్ , 112.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: