హీరోయిన్ కీర్తి సురేష్ టాలీవుడ్ లో గ్లామర్ కథానాయికగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్న విషయం తెలిసిందే. గ్లామర్ హీరోయిన్ లకే ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్న ఈ సమయంలో కీర్తి సురేష్ ఎటువంటి గ్లామర్ ను పంచకుండానే మంచి మంచి పెద్ద పెద్ద సినిమా అవకాశాలను అందుకోవడం విశేషం. తాజాగా ఆమె సర్కార్ వారి పాట సినిమా తో ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి తెలిసిందే. ఆమె పాత్ర సరికొత్తగా ఉండడంతో ఆమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. మరిన్ని పెద్ద సినిమా అవకాశాలను అందుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది.

నేను శైలజ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్ళీ సినిమా అవకాశాలను అందుకోవడంలో ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆమెకు హిట్ లు తెచ్చి పెట్టాయి. ఈనేపథ్యంలో ఆమెకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే అవకాశాలు కూడా వచ్చాయి. అలా ఆమె చేసిన మహానటి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే మంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయలేకపోయింది. ఒకానొక దశలో ఆమె కెరీర్ అక్కడితోనే పూర్తయ్యింది అని అందరూ అనుకున్నారు.

కానీ అనూహ్యంగా ఆమె తన కెరీర్ ను తిరిగి తెచ్చుకోగలిగింది. అందుకే గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండా లని ఇప్పుడు పెద్ద హీరోలతో చేయబోయే సినిమాలను మాత్రమే ఆమె ఎంచుకుంటుంది. అందులో భాగంగానే సర్కార్ వారి పాట సినిమా చేసింది. ఇప్పుడు కూడా కొంత మంది పెద్ద హీరోలతోనే ఆమె సినిమాలు చేయడానికి సిద్ధమవుతుంది. తమిళ, మలయాళ భాషల్లో కూడా ఆమెకు ఇప్పుడు మంచి మంచి సినిమా అవకాశాలు రావడం జరుగుతుంది. త్వరలోనే వాటికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: