ప్రతి సంవత్సరం లాగానే ఈ ఇయర్‌ మహేష్‌ బర్త్ డే నుంచి కొత్త కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అవి సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఎన్నో రకరకాలుగా పోట్రే అవుతున్నాయి.లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్, దళపతి విజయ్‌ ఫ్యాన్స్ మధ్య సోషల్‌ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్‌ వార్‌ జరుగుతోంది. ఇంతకీ దీనికి రీజనేంటి అనుకుంటున్నారా..? మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి, ఒక్కడు లను థియేటర్స్ లో రీ రిలీజ్‌ చేశారు. ఈ రెండు సినిమాలకు కూడా వరల్డ్ వైడ్‌ అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్‌ హీరోల హిట్ ల రీరిలీజ్‌లు ఎంత ప్రెస్టీజియస్‌గా చేయొచ్చో మరోసారి జనాలకు తెలిసొచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు వచ్చిన కలెక్షన్లను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు ఫ్యాన్స్. అంతే కాదు, మహేష్‌ నటించిన పోకిరి, ఒక్కడు సినిమాలను తమిళంలో విజయ్‌ రీమేక్ చేసి హిట్లు కొట్టాడు. పోకిరి పొక్కిరి అనే పేరుతో రీమేక్‌ కాగా, ఒక్కడు గిల్లి పేరుతో రీమేక్‌ అయి సూపర్‌డూపర్‌ హిట్‌ అవ్వడం జరిగింది.ఆ విషయాలను ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ మహేష్‌ ఫ్యాన్స్.. ‘నేషనల్‌ ట్రోల్‌ మెటీరియల్‌ విజయ్‌’ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ క్రియేట్‌ చేశారు. ఒక రేంజ్ లో విజయ్ ని విజయ్ ఫ్యాన్స్ ని మహేష్ ఫ్యాన్స్ ఆటడుకుంటున్నారు.


అటు విజయ్‌ ఫ్యాన్స్ ఈ ట్రోల్‌ని తిప్పికొట్టేలా కొన్ని హ్యాష్‌ ట్యాగ్స్ ని ప్రమోట్‌ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్‌ సెకండ్‌ డే కూడా కంటిన్యూ అయింది. వి లవ్‌ మహేష్‌ బాబు అనే కొత్త హ్యాష్‌ట్యాగ్‌తో మహేష్‌ ఫ్యాన్స్ మళ్లీ నేషనల్‌ వైడ్‌ ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ తన ఫ్యావరెట్ అని మహేష్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాదు మొన్నామధ్య మహేష్ ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. మేము మేము బాగానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలి అంటూ ఫ్యాన్స్ కు పిలుపు కూడా ఇచ్చారు. అలాగే ఒకరికొకరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లు కూడా చేసుకొని మొక్కలు కూడా నాటారు. అది గమనించి మరి ఇప్పటికైన ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూల్ అవుతారో..లేక దీన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: