యువ హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శ్రీ కార్తీక్ డైరక్షన్ లో టైం ట్రావెల్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో అమల అక్కినేని నటించారు. సినిమాకు ప్రీమియర్ షో నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు డైలాగ్స్ రాసిన ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా శర్వానంద్ తను ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాలు తీర్చడానికి ఆరేళ్లు పట్టిందని. ఆ ఆరేళ్లలో ఒక కొత్త షర్ట్ కూడా తీసుకోలేదని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంతకీ శర్వానంద్ నష్టపోయిన ఆ సినిమా ఏది అంటే కో అంటే కోటి అని చెప్పాడు. ఆ సినిమాని నిర్మించిన శర్వానంద్ సినిమా కోసం భారీగా నష్టపోయినట్టు చెప్పారు. ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి తనకు ఆరేళ్లు టైం పట్టిందని చన్నారు.

కథలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని ప్రయత్నించే శర్వానంద్. సినిమాలు ఫలితాలు తేడా కొడితే మాత్రం ఫీల్ అవుతాడని తెలుస్తుంది. ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేసిన పడి పడి లేచే మనసు సినిమా పోయినందుకు కూడా శర్వానంద్ చాలా ఫీలయ్యారట. 3 నెలలు డిప్రెషన్ లోకి వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. అయితే వరుస ఫ్లాపుల వల్ల అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందని ఆలోచించడం మొదలు పెట్టానని అన్నారు. మరి శర్వానంద్ ఈ ఒకే ఒక జీవితం సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. సినిమా గురించి ఇప్పటికే పాజిటివ్ బజ్ రాగా సినిమా ప్రేక్షకులకు నచ్చితే శర్వానంద్ ట్రాక్ ఎక్కేసినట్టే. సినిమాకు అదే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈసారి శర్వా ఖాతాలో హిట్ పడినట్టే.




మరింత సమాచారం తెలుసుకోండి: