ఇక ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ అతను కూడా నవ్వుతూ కనిపిస్తాడు నరేష్. కానీ ఎప్పుడు ప్రేక్షకులను నవ్వించే నరేష్ జీవితంలో ఒక విషాదకరమైన ఘటన ఉంది అన్న విషయం మాత్రం ఇటీవలే అందరికీ తెలిసి షాక్ అవుతున్నారు అభిమానులు. అతన్ని ఒక అమ్మాయి ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసింది అన్న విషయాన్ని స్వయంగా జబర్దస్త్ నరేష్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా నరేష్ ఒక అమ్మాయి తో కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు.
ఇందులో భాగంగా నరేష్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ముందుగా రిజెక్ట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత నరేష్ తో ప్రేమలో పడ్డట్లుగా నటిస్తుంది. ఆ తర్వాత అతని దగ్గర బాగా డబ్బులు గుంజుతు మరో వ్యక్తిని ప్రేమిస్తూ అతనితో పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని నరేష్ పర్ఫామెన్స్ రూపంలో చూపించాడు. ఎంతో నాచురల్ గా డాన్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. పర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత అంత నాచురల్గా చేశారు.. మీ లైఫ్ లో ఇలాంటి జరిగింద అంటూ సదా నరేష్ ని అడుగుతుంది. అవును మేడం నిజంగానే జరిగింది అని నరేష్ సమాధానం చెప్పడంతో అభిమానులకు షాక్ అవుతున్నారు.