పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఇలా భీమ్లా నాయక్ మూవీ తో ఈ సంవత్సరం ఇప్పటికే మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కొంత కాలం పాటు నిలిచిపోయింది.

మళ్ళీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి కొంత భాగం షెడ్యూల్ ని పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఈ సినిమా షూటింగ్ కు కాస్త గ్యాప్ వచ్చింది. దానితో పవన్ కళ్యాణ్ తమిళ్ మూవీ వినోదయ సీతం ని ముందుగా ఫినిష్ చేసి , ఆ తర్వాత హరిహర వీరమల్లు మూవీ ని కంప్లీట్ చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు తెలుస్తుంది.

ముందుగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ ని పూర్తి చేసి , ఆ తర్వాతే వినోదయ సీతం మూవీ ని  కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 2 వ తేదీన హరిహర వీరమల్లు మూవీ నుండి పవర్ గ్లాన్స్ పేరుతో  ఒక వీడియోని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో హరిహర వీరమల్లు మూవీ ని ముందుగా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: