సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలలోనే ప్రారంభం కాబోతున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 8 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.  ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 8 వ తేదీన కూడా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ వచ్చే సోమవారం అనగా సెప్టెంబర్ 11 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది.  ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించనున్నాడు. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చాలా సంవత్సరాల తర్వాత తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: