బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన పాన్ ఇండియా సినిమా 'బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ'.ఇక ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. దాదాపు ఎనిమిదేళ్లు ఈ సినిమా స్క్రిఫ్ట్‌పై పనిచేశాడు. పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకుని చిత్ర కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ , ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ ప్రాజెక్టు రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 'బ్రహ్మాస్త్ర' కు హైదరాబాద్‌లో రిలీజ్ రోజే షాక్ తగలనుంది. కోట్లలో నష్టం వాటిల్లనుంది.ప్రపంచవ్యాప్తంగా 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఆ రోజే హైదరాబాద్‌లో భారీ ఎత్తున గణేశ్ నిమజ్జనం జరగనుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గణనాథుడి విగ్రహలను నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల థియేటర్స్‌ మూసివేతకు ఆదేశాలిచ్చారు.


ప్రసాద్స్ వంటి మల్లీప్లెక్స్‌తో పాటు థియేటర్స్ తెరచుకోవడం లేదు. దీంతో కొన్ని వందల షోలు రద్దయ్యాయి. ఫలితంగా మేకర్స్ కోట్లలో నష్టపోయారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచే ఈ నష్టం రూ.2కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, మేకర్స్‌కు ఊరటనిచ్చే విషయమేమిటంటే టిక్కెట్ బుక్కింగ్స్ ప్రారంభమైన చోట ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఈ చిత్రం మొదటి రోజు రూ.25కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు వసూళ్లను సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 8000స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నారు. భారత్‌లో 5000స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 3000 స్ర్కీన్స్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి తెలుగులో సమర్పిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: