విజయ్ దేవరకొండ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరు కూడా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. దాంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.

 వాస్తవానికి వీరిద్దరి కలయికలో సినిమా ఇప్పట్లో లేదు కానీ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఒక సినిమా ఆగిపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ తెరపైకి వచ్చింది దానికి తోడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న సినిమా కూడా ప్రస్తుతానికి వాయిదా పడడంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఇకపోతే హరీష్ శంకర్ విజయ్ దేవరకొండ కోసం ఒక మంచి కథను రాశాడని ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని అంటున్నారు. 

మాస్ మసాలా కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల లిగర్ సినిమాతో భారీ పరాజయాన్ని మూట కట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఖుషి అనే ఓ ప్రేమకథ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయబోతున్నాడు. జనవరి నుంచి హరీష్ శంకర్ చిత్రాన్ని ఆయన మొదలుపెట్టబోతున్నాడు.  త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అని చెబుతున్నారు. మరి తొలిసారి వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రం ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ శంకర్సినిమా ను కూడా చేయలేడు. పవన్ తో చేయాల్సిన సినిమా వాయిదా పడుతూ రావడం నిజంగా ఆయనకు ఎంతో నిరాశ ను కలిగిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: