పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఒకటి భవదీయుడు భగత్ సింగ్ చిత్రం. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఈ సినిమాను వాయిదా వేయడం ఆయన అభిమానులతో పాటు హరీష్ శంకర్ అభిమానులను కూడా ఎంతగానో నిరాశపరిచింది. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే పూర్తయి విడుదల అవ్వాల్సిన సినిమా కానీ ఈ సినిమా చేయవలసిన సమయంలో వేరే సినిమాలను చేసి దీనిని పూర్తిగా పక్కన పెట్టడంతో ఇప్పటివరకు ఈ చిత్రాన్ని మొదలు పెట్టలేకపోయాడు.

హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ గతంలో తాను మొదలు పెట్టిన హరిహర వీరమల్లు సినిమాను మళ్ళీ మొదలు పెట్టడం విశేషం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం యొక్క అప్డేట్ ఇంతవరకు  అవ్వకపోవడం అసలు ఈ సినిమాను మొదలుపెట్టే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా లేదా అన్న అనుమానాలను కలిగిస్తుంది. ఒకవైపు దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి సినిమా చేయడానికి ముందుకు వెళుతున్నాడు.

ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించి ఒక మాట కూడా మాట్లాడడం లేదు. దీంతో ఈ సినిమా అసలు ఉంటుందా లేదా అన్న అనుమానాలను ప్రతి ఒక్కరు కూడా కలిగిస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ తో తన తదుపరి సినిమాను మొదలుపెట్టబోతున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కనపెట్టి ఆ సినిమాను మొదలు పెడుతున్నాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అనుకుంటున్న నేపద్యంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న రెండు సినిమాలు కూడా ఆగిపోవడం ఆమెకు భారీ మైనస్ అని చెప్పాలి. మరి హరీష్ శంకర్ విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంచుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: