శర్వానంద్ కెరీర్ చాలా స్లో గా వెళుతోంది. తనకి హిట్ దక్కి చాలా కాలం అయింది. ఈ సారి వచ్చే సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కాస్త సమయం తీసుకుని చేసిన సినిమా "ఒకే ఒక జీవితం". ఈ రోజు థియేటర్ లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇందులో శర్వానంద్, రీతూ వర్మ, అమల, నాజర్ , వెన్నెల కిషోర్, ప్రియదర్శి లు నటించారు. ఎస్ ఆర్ ప్రభు మరియు ప్రకాష్ బాబు లు నిర్మాతలుగా వ్యవహరించగా... శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. కాగా ఉదయం నుండి మీడియా మరియు ప్రేక్షకుల నుండి వినిపిస్తున్న రెస్పాన్స్ ప్రకారం శర్వానంద్ ఖాతాలో హిట్ పడినట్లే తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి స్పందన పాజిటివ్ గా వినబడుతోంది. అయితే ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికి వస్తే సినిమా ప్రస్తుతం లో ముగ్గురు స్నేహితులు వివిధ సమస్యలతో జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ఒక శాస్త్రవేత్త సహాయంతో మళ్ళీ గతంలోకి వెళ్లి వారి జీవితాలను గొప్పగా మార్చుకోవాలన్నది వారి ఆలోచన.  కానీ ఈ ముగ్గురు స్నేహితులతో మన హీరో శర్వానంద్ మాత్రం కొంచెం సెంటిమెంట్ గా అలోచించి అప్పటికే చనిపోయిన తన అమ్మ ప్రాణాలను కాపాడాలని అనుకుంటాడు. అలా మొదలైన సినిమా ఎన్ని మలుపులు తీసుకుంది ? ముగ్గురి ఆశయాలు తీరాయా ? అన్నది మంచి ప్లాట్ అని చెప్పాలి. ఇందులో దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.

శర్వానంద్ మరియు అమ్మగా నటించిన అమల మధ్యన వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా అమల తన నటన మరియు నవ్వు తో సినిమాను ఒక లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శికామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. సినిమాకు టాక్ పరంగా బాగున్నా ఇది వసూళ్లను సాధించడంలో ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: