పూర్తి తెలుగు కంటెంట్ తో ప్రారంభం అయిన ‘ఆహా’ ను చూడని తెలుగు ఓటీటీ ప్రేక్షకుడు ఉండడు. ప్రస్తుతం రియాలిటీ షోలకు గేమ్ షోలకు విపరీతంగా రేటింగ్స్ వస్తున్న పరిస్థితులలో ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ‘ఆహా’ ప్రయత్నాలు చేస్తోంది. ఈప్రయత్నాలలో భాగంగా ‘ఆహా’ 'డ్యాన్స్ ఐకాన్'  అనే డ్యాన్స్ షోను ప్రారంభించ బోతోంది. ఈషోకు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించ బోతున్నాడు.  షోతో అలరించడానికి రాబోతోంది.



సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. 'డ్యాన్స్ ఐకాన్' షోకి సీనియర్ నటి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరించబోతోంది. ఇప్పటికే 'క్వీన్' వెబ్ సిరీస్ తో ఓటీటీ లోకి అడుగు పెట్టిన రమ్యకృష్ణ కు ఇది మరొక అవకాశం. ఆమెతో పాటుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా జడ్జిగా ఉంటున్నాడు.


ఈ డ్యాన్స్ షోలో మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ ఉంటారని తెలుస్తోంది. వీరిని వేలం ద్వారా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కొనుగోలు చేస్తారట.
వీరికి శ్రీముఖి యష్ మాస్టర్ మోనాల్ గజ్జర్ మెంటర్స్ గా ఉండబోతున్నారు. 12 మంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కో కొరియోగ్రాఫర్ ఉంటాడు. ఈ పోటీలో గెలిచిన డాన్సర్ కు కొరియోగ్రాఫీ నేర్పించిన కొరియోగ్రాఫర్ కు సినిమాలలో అవకాశాన్ని ఇస్తారట.


సెప్టెంబర్ 11న ప్రారంభమయ్యే ‘డ్యాన్స్ ఐకాన్’ ఫస్ట్ ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ అనన్య పాండే లు అతిధిలుగా రాబోతున్నారు. వర్ధమాన ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు మరియు డ్యాన్సర్ల కు తమ టాలెంట్ ను నిరూపించుకునే షోగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు రెగ్యులర్ ఎపిసోడ్స్ ప్రారంభం అవుతాయి. డాన్స్ షోలు అంటే విపరీతమైన మ్యానియా కొనసాగుతున్న పరిస్థితులలో ఈషో కూడ ‘ఆహా’ కు మరింత మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: