తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు.ఎందుచేత అంటే పేరు ఉన్న నటీనటులే కాకుండా దర్శకులు , టెక్నీషియన్లు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. తాజాగా తనదైన నటనకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న గురుస్వామి కన్నుమూయడం జరిగింది. గురు స్వామి అంటే ఎవరికి పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు కానీ మహేష్ బాబు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి చిత్రంలో అదే రైతుగా నటించి మెప్పించారు. దీంతో ఇప్పుడు ఈ నటుడు ఎవరనే విషయం అందరికీ అర్థమై ఉంటుంది.


ఈ సినిమాలో మహేష్ బాబు వ్యవసాయం అంటే ఏంటో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ గురు స్వామి. అయితే ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జన్మించారు అయితే చదువు అంతా కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు ఈయన. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రభుత్వ విభాగంలో కూడా ఉద్యోగం చేశారు .అయితే ఆ సంపాదన ఎటు చాలక పోవడంతో ఉద్యోగాలు చేసుకుంటూనే పలు నాటకాలు వేసేవారు. అలా నటన వైపు అడుగులు వేశారు గురుస్వామి. ఈ క్రమంలోనే విజేత ఆర్ట్స్ అనే సంస్థ స్థాపించి పలు ప్రాంతాలలో నాటకాలు కూడా వేయడం జరిగిందట.


కానీ అంతగా గుర్తింపు రాలేదట అలాంటి సమయంలోనే 2019లో వచ్చిన మహేష్ నటించిన మహర్షి సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆ చిత్రంలోని నటన డైలాగులు ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు.ఆ తర్వాత నితిన్ నటించిన భీష్మ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రాలలో తన నాతో ప్రేక్షకులను బాగా అలరించారు.. అలా మరిన్ని పాత్రలలో కూడా నటిస్తూ ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో గురుస్వామి అనారోగ్య బారిన పడడం జరిగింది.ఈ క్రమంలోని నిన్నటి రోజున ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూయడం జరిగినట్లు సమాచారం. దీంతో సినీ ప్రముఖుల సైతం ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: