టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించిన శర్వానంద్ భాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ , శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించగా ,  వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ,  జాక్స్ బీజాయ్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

\ఈ మూవీ మంచి అంచనాల నడుమ నిన్న అనగా సెప్టెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఒకే ఒక జీవితం మూవీ ఇటు ప్రేక్షకుల ...  నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంటుంది.

అలాగే ఒకే ఒక జీవితం మూవీ కూడా చాలా రోజుల తర్వాత శర్వానంద్ కు మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర తీసుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే ఒకే ఒక జీవితం మూవీ బిజినెస్ వివరాల్లోకి వెళితే ...  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా ,  8 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. మరి ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లంజ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: