ప్రేమమ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె  ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఫిదా చేసిన ఈమె అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె గ్లామర్ కు ఏమాత్రం తావు లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే ఇప్పటికే తెలుగులో పలువురు యంగ్ హీరోల సరసన నటించిన సాయి పల్లవి 

తాజాగా రానా సరసన నటించిన విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ ఇందులో సాయి పల్లవి నటన మాత్రం అద్భుతంగా ఉందని ఈమె నటనకు మార్కులు పడ్డాయి.అయితే ఈ సినిమా అనంతరం గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి....తన సినీ కెరియర్లో తనకు ఇష్టమైన సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇకఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో తనకు నాలుగు సినిమాలంటే చాలా ఇష్టం అంటూ సినిమా పేర్లను వెల్లడించారు.

అయితే  ఈమె కెరియర్ లో నటించిన ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్, గార్గి సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు.  ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫేవరెట్ హీరో సూర్య అని ఫేవరెట్ హీరోయిన్ జ్యోతిక అంటూ తెలియజేశారు.ఇదిలావుంటే తనకు ఎంతో ఇష్టమైన విషయాలన్నింటి గురించి కూడా ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక  ఇలా సాయి పల్లవి తన ఇష్ట ఇష్టాలు గురించి తెలియ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే  ఇక విరాటపర్వం సినిమా తర్వాత సాయి పల్లవి ఎలాంటి తెలుగు సినిమాలను ప్రకటించలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: