ఇటీవల కాలంలో ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆసక్తి పరిచిన సినిమా బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, నాగార్జున కీలక పాత్రలలో నటించగా అంగరంగ వైభవంగా ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమా నిన్న విడుదల అయ్యి ఒక వర్గం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అని చెప్పాలి. భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదని కొంతమంది చెప్పుకుంటున్నారు.

కారణం ఏదైనా ప్రతి బాలీవుడ్ సినిమా లాగానే ఈ సినిమాని కూడా ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా నిర్మాతలు చేయలేకపోయారు. ఫలితంగా బ్రహ్మస్త్ర సినిమా యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇక తెలుగు విషయానికి వస్తే ఈ సినిమాకు మొదటి నుంచి ముందుండి ప్రచారం చేయసాగాడు రాజమౌళి. బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన సినిమాలకు హెల్ప్ చేసిన సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆయన ప్రచారం చేయసాగారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ఇంటర్వ్యూల దాకా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఈ సినిమాకి ప్రచారం చేసి సినిమా పట్ల ఆసక్తిని వచ్చేలా చేయగలిగాడు.

కానీ కంటెంట్ ప్రేక్షకులందరికీ నచ్చకపోవడంతో ఈ సినిమా హిట్ అవ్వడానికి ఆయన చేయి వేసిన కూడా అది వర్కౌట్ అవలేదని చెప్పాలి. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తొలి భాగం ఈ విధంగా అవడం తర్వాతి రెండు భాగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఆ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. మరి తొలిభాగంతో మోస్తరుగానే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత రెండు భాగాలతోనైనా అందరినీ అలరిస్తుందా అనేది చూడాలి. మొదటినుంచి ఈ సినిమా విడుదలకు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మధ్యలోనే క్యాన్సల్ అయిపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: