టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపొందిన బాహుబలి సినిమా ఎంతటి స్థాయిలో చరిత్ర సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా వసూళ్ల పరంగా నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మూడేళ్లు ఈ సినిమానే ట్రెండ్ అయ్యింది అంటే ఎంతటి స్థాయిలో ఈ చిత్రానికి గుర్తింపు వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.  వెయ్యి కోట్లకు పైగా వసూలను సాధించిన ఈ సినిమా స్థాయిలో ఇంతవరకు ఏ సినిమా కూడా రూపొంద లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నా మాట.

ఎప్పటికప్పుడు బాహుబలి సినిమాలా మా చేస్తున్నామని అందరూ కూడా చెప్పుకోవడమే తప్ప అలాంటి సినిమాను చేయకుండా బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతూ కొంతమంది తమ పరువు తీసేసుకున్నారు. ఆ విధంగా తమిళనాడులో రూపొందిన పోన్నియన్ సెల్వన్ చిత్రం కూడా బాహుబలి సినిమాతో కంపేర్ చేయడం ఆ చిత్రంపై ట్రోల్స్ పెరగడానికి కారణం అవుతుంది. విక్రమ్ కార్తీ జయం రవి ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించడం ఈ సినిమాపై ఎంతటి స్థాయిలో బజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం. 

అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసే విధానంలో చిత్ర బృందం తప్పు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే తమ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో తమ సినిమా పేరును చెప్పుకుంటే పర్వాలేదు కానీ దానిని బాహుబలి తో కంపేర్ చేయడమే ఆ సినిమాకు త్రొల్  జరుగుతుంది. ప్రతి సినిమాలో బాహుబలితో కంపేర్ చేయడం ఆ తర్వాత అంతటి స్థాయిలో ఏ సినిమా కూడా లేకపోవడం జరగడమే ఈ విధంగా ట్రోల్ జరగడానికి కారణం అని చెప్పాలి. ఈ సినిమాలో తమిళ సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు నటిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ త్రిష లాంటి పెద్ద హీరోయిన్ లు నటిస్తున్నారు. ఈ క్రమంలో వారి ద్వారా ఈ సినిమాను ప్రమోట్ చేస్తే ఈ చిత్రం మంచి బిజినెస్ చేస్తుంది అని బాహుబలి ఫ్యాన్స్ చెప్పే మాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: