బెల్లంకొండ గణేష్ హీరోగా ఇప్పుడు రెండవ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఆయన మొదటి సినిమా స్వాతిముత్యం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే తదుపరి సినిమాను విడుదల చేయడానికి బెల్లంకొండ గణేష్ రంగం సిద్ధం చేయడం నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే విషయం అనే చెప్పా లి. నిర్మాతగా బెల్లంకొండ సురేష్ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి వాటి ద్వారా ఘనవిజయాన్ని అందుకున్నాడు.

అందుకే ఆయన తన తనయులను కూడా అంతటి స్తాయి హీరోలను చేయాలని భావించి పెద్ద కొడుకును హీరోగా పరిచయం చేయించి హీరోగా సెటిల్ చేయించాడు. ఆ విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో సినిమా చేసే స్థాయికి ఎదగగా ఇప్పుడు ఆయన రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి వలస సినిమాలను చేస్తున్నాడు. ఆ విధంగా స్వాతిముత్యం అనే సినిమాను ఇప్పటికే పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన ఆయన ఇప్పుడు రెం డవ సినిమాను కూడా మొదలు పెట్టడం విశేషం.

నేను స్టూడెంట్ సార్ అనే టైటిల్ తో ఆయన షూటింగ్ చేయబోతున్న ఈ సినిమా యొక్క పోస్టర్ విడుదల అయ్యి మంచి రెస్పా న్స్ అందుకుంటుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిపోతుంది అని కూడా తెలుస్తుంది. మరి బెల్లంకొండ శ్రీనివాస్ మాదిరి గానే ఈ హీరో కూడా మంచి యాక్షన్ హీరోగా ఎదుగు తాడా అనేది చూడాలి. ఈ సినిమా యొక్క పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మణిశర్మ తనయుడు మహాతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. దాదాపు అందరూ కొత్తవారే ఉంటున్న ఈ సినిమా ఈ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. మొదటి సినిమా విడుదల వచ్చే నెలలో జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ హీరో ఎలాంటి సినిమాలను ఎంచుకుంతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: