కొన్ని కొన్ని సార్లు సినిమా పరిశ్రమలోని హీరోలు కొన్ని మంచి ఛాన్సులు మిస్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యాడు ప్రభాస్. బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఆయన ఎంతటి భారీ గుర్తింపును ధగ్గించుకున్నాదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా అంతటి క్రేజ్ కలిగి ఉన్న హీరో అప్పటివరకు ఎవరూ లేరని చెప్పాలి. ప్రభాస్ ను మించిన క్రేజ్ ఉన్న హీరో కూడా ఎవరూ లేరు. అంతటి స్థాయిలో విజయాన్ని క్రేజ్ ను అందు కున్న ప్రభాస్ నెంబర్ వన్ గా పారితోషకం అందుకుంటూ మంచి యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు.

అభిమానులను కాలర్ ఎగిరెలా చేసిన ప్రభాస్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలం అయ్యాడని చెప్పాలి ఎందుకంటే బాహుబలి సినిమా తరువాత ఆయన చేసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచాయి. భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన సాహో సిని మా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేదు. ఆ తరువాత ప్రేమ కథ సినిమాగా వచ్చిన రాధే శ్యామ్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది దాంతో ఆయనకు వచ్చిన క్రేజ్ కాస్త తగినట్లు అయింది.

 బాహుబలి సినిమా తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్ కు వచ్చిన యాడ్స్ భారీ స్థాయిలో ఉన్నాయి అలాంటి యాడ్స్ ఇప్పు డు రావడం లేదని చెప్పాలి. దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న తొలి హీరో కావడంతో ఈయనతో సినిమా చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి ఘనపరిచారు. పెద్ద పెద్ద బ్రాండ్లు అన్నీ కూడా ప్రభాస్ తో చేయాలని భావించారు. కానీ అది సినిమాలో వర్కౌట్ కాకపోవడంతో అవన్నీ ఇప్పుడు లేవనే చెప్పాలి మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలతోనైనా ప్రభాస్ మంచి  విజయా లను అందుకొని మరిన్ని యాడ్స్ చేసే అవకాశాలను అందుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: