బ్రహ్మాస్త్ర సినిమాని  అంతకముందు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రణబీర్ కపూర్ పుణ్యమా అంటూ ఈ పేరు ఇప్పుడు అందరి నోళ్ళల్లో నాని పోతుంది.ఎన్నో భారీ అంచనాల నడుమ నిన్న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుని పర్లేదనిపించింది. ఓవర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చినా.. మరో వర్గం ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. కొందరైతే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని కూడా అంటున్నారు.డిఫరెంట్ కాన్సెప్ట్ అయ్యేసరికి జనాలకి ఎక్కలేదో.. లేక అయాన్ ముఖర్జీ తీసిన డైరెక్షన్ జనాలకి నచ్చలేదో తెలియదు కానీ ..సినిమానైతే కొంతమంది అట్టర్ ఫ్లాప్ అంటూ రివ్యూ ఇచ్చారు.దీంతో అందరి కళ్ళు బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్స్ పైనే పడ్డాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్ర సినిమా సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ ను చూసి జనాలు షాక్ అవుతున్నారు.


బ్రహ్మాస్త్ర సినిమా వరల్డ్ వైడ్ గా మొదటిరోజు దాదాపు 37 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు ట్రేడ్ అనాలసిస్ట్ రమేష్ బాల తెలిపారు.హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన ఒరిజినల్ చిత్రంగా బ్రహ్మాస్త్ర రికార్డులు సృష్టించిందని ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.దీంతో గత కొన్ని రోజులుగా వరుస ప్లాప్స్ తో అల్లాడిపోతున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్రహ్మాస్త్ర మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి . అంతేకాదు అమెరికాలోనూ బ్రహ్మాస్త్ర సినిమా రికార్డుల కలెక్షన్స్ సాధించింది.యూఎస్ఏ లో ఈ చిత్రం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడినట్టు తెలుస్తుంది . తొలిరోజే వన్ మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే బ్రహ్మాస్త్ర సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధిస్తుందని త్వరలోనే బాహుబలి లాగే వందకోట్ల క్లబ్ ను దాటేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.మరి చూడాలి ఎంతవరకు వసూళ్లు రాబడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: