మహా భారతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో వున్న ప్రతి భారతీయుడు చాలా గర్వంగా చెప్పుకునే చరిత్ర. మన భారతదేశ ఇతిహాసాల్లోనే కాకుండా ప్రపంచ ఇతిహాసాల్లో ఈ కథ ఒక అద్భుతం అని చెప్పాలి. మహా భారతం ఓ గొప్ప హిస్టరీ. ఇది ప్రపంచ దేశాలు కల్పితం అని భావించినా కూడా కొన్ని ఆధారాల ద్వారా ఇది నిజమైన కథ కల్పితం కాదు అని నిరూపించబడింది. దానికి ఉదాహరణలగా గుజరాత్ లోని అరేబియా సముద్రంలో మునిగిపోయిన శ్రీ కృష్ణుని సృష్టి ద్వారకా నగరం,ఇంకా ఎన్నో వున్నాయి. ఇక హిందూ పురాణాలు బట్టి 'వ్యాసుడు' అనే మహర్షి ద్వాపరయుగంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మహాభారత కథని రాసినట్టు చెబుతారు.కౌరవులు, పాండవులు మధ్య జరిగే కథలో.. ఎన్నో కుతంత్రాలు, మలుపులు, చిక్కులు, అన్నిటికిమించి కురుక్షేత్ర యుద్ధం. ఆ మహాభారతం కథను 'మాస్టర్ అఫ్ అల్ స్టోరీస్' అనేలా చేసింది.ఇక ఈ కథని సినిమాగా తెరకెక్కించాలన్నది భారతదేశ ప్రతి దర్శకుడికి ఉండే కల. 


ఆ కోవలోకే మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా వస్తాడు. ఇప్పటికే అయిన చాలా సందర్భాల్లో మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ కథని తాను చివరగా తీసే సినిమాగా తెరకెక్కించాలన్నది అయన కోరిక. అయితే ఇంతలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక ప్రకటన చేశారు.'ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప ఇతిహాసం మహాభారతం. మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడింది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం ఎదురుచూస్తూ ఉండండి, త్వరలో వస్తోంది హాట్ స్టార్ లో' అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తూ, ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే ఇందులో ఎవరు నటిస్తున్నారు, ఎవరు తీస్తున్నారు, ఎప్పుడు మొదలైంది అనే ఏ విషయాలు తెలుపలేదు. పోస్ట్ చేసిన ఫోటోలు బట్టి చుస్తే, యానిమేటెడ్ తరహాలో ఈ కథ తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: