రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపుగా 180కు పైగా సినిమాలలో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా హీరో ప్రభాస్ పెదనాన్నగా మంచి పేరు సంపాదించారు. అయితే నిన్నటి రోజున కృష్ణంరాజు స్వల్ప అస్వస్థకు గురవడంతో హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలియజేశారు . అయితే అక్కడికి ప్రభాస్ అతని స్నేహితులు వెళ్లినట్లుగా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే అందరూ కూడా కృష్ణంరాజు ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ ఉండదని భావించారు. కానీ ఈరోజు తెల్లవారుజామున 3:25 గంటలకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక కరోనా సమయంలో కృష్ణంరాజు కూడా ఆస్పత్రిలో చేరడం జరిగింది. మహమ్మారి కరోనాను  సైతం ఆయన ఎదిరించగా కానీ ఇలా ఇప్పుడు 83 సంవత్సరాలు వయసులో కన్నుమూయడం అందరికీ చాలా బాధాకరమని అనిపిస్తోంది. ఇంకా ఒకరి పెళ్లిళ్లు కూడా జరిపించని కృష్ణంరాజు ఉన్నట్టుండి అందరిని అనాధలుగా మార్చారని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈయనకు ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. అలాగే ప్రభాస్ ఇక నలుగురి పిల్లల బాధ్యతను తీసుకున్న కృష్ణంరాజు ఒక్కరికి కూడా వివాహం జరిపించుకుని కన్నుమూయడంతో మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అటు కృష్ణంరాజు కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయారు. ఇప్పటినుంచి ప్రభాస్ తన రెండు కుటుంబాలకు పెద్దదిక్కుగా మారాల్సి ఉంటుంది. ఇక కృష్ణంరాజు మరణానికి పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు.


కృష్ణంరాజు ఒక సీనియర్ నటుడు మాత్రమే కాదు రాజకీయవేత్త కూడా. 1980 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన కృష్ణంరాజు బిజెపి పార్టీలో చేరి 12వ లోకసభ ఎన్నికలలో కాకినాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 13వ లోకసభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గంలో నుంచి ఎన్నికయి ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: