ఇండస్ట్రీలోకి ఎంతోమంది సినీ నటులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అందు లో సక్సెస్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది కనుమరుగైన వారు కూడా ఉన్నారు. ఇండస్ట్రీ లో ఎవరికి ఎప్పుడు స్టార్ట్ డమ్ వస్తుందో వివరము చెప్పలేము. సరైన పాత్ర పడితే తగిన గుర్తింపు లభిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు ఎక్కువగా నార్త్ అమ్మాయిలకి అవకాశాలు ఇస్తూ ఉంటారని తెలుగు అమ్మాయిలను అసలు పట్టించుకోరని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అది కేవలం వట్టి అపోహ అన్నట్లుగా ఇప్పుడు తెలుస్తోంది. టాలెంట్ ఉంటే తెలుగు అమ్మాయిలకు కూడా పిలిచి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు మన దర్శక నిర్మాతలు.



అందుకు ఉదాహరణగా ఒక తెలుగు అమ్మాయి అక్షర అని కూడా చెప్పవచ్చు. నటన పట్ల ఆసక్తి ఉండడంతో సిని రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. మొదట కళ్యాణ్ రామ్ హీరోగా, డైరెక్టర్ సతీష్ విగ్నేష్ దర్శకత్వంలో వచ్చిన ఎంత మంచి వాడవురా అనే చిత్రంతో  పెళ్లికూతురు పాత్రలో అద్భుతంగా నటించింది ఆ తర్వాత హీరో రామ్ నటించిన రెడ్ చిత్రంలో ఇన్స్పెక్టర్ సంపత్ కూతురిగా నటించింది. ఇక తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రంలో ఈమె నటనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.


ఇక పుష్ప చిత్రంలో ఈమె వదిన పాత్రలో నటించింది. ఇక పార్ట్-2  లో కూడా అక్షర పాత్ర ఎక్కువగా ఉంటుందని పుష్ప చిత్రం హిట్ అవడంతో ఈమెకు రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న రావణాసుర అనే సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో కూడా ఈమెది చాలా కీలకమైన రోల్ ఆన్నట్లుగా సమాచారం. ఈమె ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడమే తన ఉద్దేశం లక్ష్యం ఉన్నట్లుగా ఎప్పుడు చెబుతూ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: