రెబల్ స్టార్ గా కోట్లాదిమంది తెలుగు ప్రజలకు సుపరచితమైన కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున ఏఐజీ హాస్పటల్ లో చికిత్సపొందుతూ మరణించిన విషయం తెలుగు ప్రజలకు తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి అయ్యారు. సుమారు 183 పైగా సినిమాలలో నటించిన కృష్ణంరాజు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.



సినిమాలలో నటిస్తూనే రాజకీయాలలోకి వచ్చిన కృష్ణంరాజు రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ గా ప్రజలు చేత ఎన్నుకోబడి అలనాటి ప్రధానమంత్రి వాజపేయి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసి వివాదరహితుడుగా పేరు గాంచాడు.   హీరోగా కృష్ణంరాజుకు ప్రత్యేకమైన మాడ్యులేషన్ డైలాగ్ డెలివరీలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆయన పొందాడు. హీరోగా కెరియర్ మొదలుపెట్టి విలన్ గా మారి ఆతరువాత హీరోగా యూటర్న్ తీసుకున్న కృష్ణంరాజు టాలీవుడ్ సీనియర్ హీరోలలో అగ్రగామిగా నిలిచాడు.



ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా మూవీలో కలిసి నటించాలి అన్నకోరికను ‘రాథే శ్యామ్’ మూవీతో తీర్చుకున్నాడు. జీవితంలో ఎన్నో గౌరవాలు మరెన్నో సత్కారాలు పదవులు పొందిన కృష్ణంరాజు కు ఒక తీరని కోరిక ఉంది అంటారు. రాజకీయాలకు అతీతంగా ఉండే గౌరవ ప్రదమైన గవర్నర్ పదవి తో తన జీవితాన్ని ముగించాలని కృష్ణంరాజు కోరుకునే వారు అంటూ ఆయన సన్నిహితులు చెపుతూ ఉంటారు. భారతీయజనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణంరాజు గవర్నర్ గా నియమింపబడబోతున్నారు అంటూ కొన్ని మీడియా సంస్థలు ఊహాగానాలు చేసాయి.



అయితే ఆ ఊహాగానాలు కార్యరూపం దాల్చలేదు సీనియర్ హీరోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు మాత్రమే కాకుండా ఆయనపట్ల ఇండస్ట్రీలో అందరికీ గౌరవం ఉంది. స్థాయితో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు ఎవరినైనా పిలిచి ఆప్యాయంగా పలకరించే కృష్ణంరాజు మంచి సాహితీ అభిమాని కూడ. తెలుగు భాష పట్ల తెలుగు సంస్కృతి పట్ల మంచి అభిమానం ఉన్న కృష్ణంరాజు మరణించినప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం శాస్వితంగా మిగిలిపోతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: