సుడిగాలి సుదీర్.. తెలుగు బుల్లితెరపై ఈ పేరు కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే దాదాపు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఇతని పాపులారిటీ గురించి తెలుసు. ఇక ఎంతోమంది  సుడిగాలి సుదీర్ ను అమితంగా అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఒక మెజీషియన్ గా తన కెరియర్ ప్రారంభించిన సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. టీం లీడర్ గా కూడా ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్నాడు.


 ఒకవైపు జబర్దస్త్ యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ కారణంగా కూడా సుడిగాలి సుదీర్ కి ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. కొన్ని కారణాల వల్ల ఈ టీవీ నుంచి తప్పుకున్న సుడిగాలి సుదీర్ స్టార్ మా లో పలు కార్యక్రమాలలో తనదైన శైలిలో అలరిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా సూపర్ సింగర్ జూనియర్ అనే షోలో అనసూయ తో కలిసి సందడి చేస్తున్నాడు. అయితే సుధీర్ ఎక్కడ కనిపించినా కూడా రష్మీ సుధీర్ కి సంబంధించిన లవ్ మేటర్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.



 ఇటీవలే స్టార్ మా లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్ ఎపిసోడ్ లో ఇద్దరు అమ్మాయిల కారణంగా సుడిగాలి సుధీర్ కి ఎంతగానో ఇబ్బంది పడ్డాడు.  ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకోకుండా తప్పించుకున్నాడు అంటూ ఒక అమ్మాయి రచ్చ చేసింది. ఇంకొక అమ్మాయి అన్నయ్య అంటూ సుధీర్ వెంట పడటం గమనార్హం.  తనకు పెళ్లి చేయమని గోలగోల చేసింది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోమని ఇంకో అమ్మాయి పెళ్లి చేయమని వెంట పోవడంతో ఇద్దరి మధ్య సుధీర్ నలిగిపోయాడు. నేను చిన్న పిల్లాడిని  మా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరు అటు చెప్పడం గమనార్హం. వీరి మధ్య సంభాషణ నవ్వులు పూయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: