‘భవధీయుడు భగత్ సింగ్’ స్క్రిప్ట్ ను హరీష్ శంకర్ పూర్తిచేసి పవన్ కళ్యాణ్ కు వినిపించి సుమారు సంవత్సరకాలం అవుతున్నా పవన్ కళ్యాణ్ డేట్స్ ఈ మూవీకి ఎప్పుడు దొరుకుతాయో తెలియని పరిస్థితి. మైత్రీ మూవీస్ సంస్థ ఈ మూవీని నిర్మించడానికి రెడీగా ఉన్నప్పటికీ పవన్ రాజకీయాల హడావిడి మరియు అతడి మూడ్స్ వల్ల హరీష్ శంకర్ ప్రాజెక్ట్ మొదలయ్యే విషయంలో స్వయంగా హరీష్ శంకర్ కు కూడ క్లారిటీ లేకపోవడంతో అతడు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా గుసగుసలు వినిపించాయి.


ఇప్పుడు హరీష్ శంకర్ సమస్యలకు విజయ్ దేవరకొండ రూపంలో పరిష్కారం లభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం విజయ్ దేవరకొండ దిల్ రాజ్ కు ఒక సినిమా చేసి ఇస్తానని మాట ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్ కూడ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాలని విజయ్ భావిస్తున్నట్లు టాక్.


‘లైగర్’ ఘోర పరాజయం తరువాత విజయ్ దృష్టి పాన్ ఇండియా సినిమాల పై కాకుండా తనను క్రేజీ హీరోగా మార్చిన తెలుగు సినిమాల పై పడటంతో కొన్ని కమర్షియల్ మాస్ సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించిన తరువాత మళ్ళీ పాన్ ఇండియా సినిమాల గురించి ఆలోచనలు చేయాలని విజయ్ అభిప్రాయం అని అంటున్నారు. ఈ వ్యూహాలలో భాగంగా విజయ్ హరీష్ శంకర్ తో ఒక మూవీని చేసే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.


ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ షూటింగ్ మరో రెండు నెలలలో పూర్తి అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆతరువాత ఖాళీగా ఉండకుండా దిల్ రాజ్ తో మూవీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆతరువాత అన్నీ కలిసి వస్తే సుకుమార్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయాలని విజయ్ ఆలోచన అని తెలుస్తోంది..  




మరింత సమాచారం తెలుసుకోండి: