టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఈయన హీరో గా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన ఒకే ఒక జీవితం  సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించారు.ఇదిలావుంటే ఇక సినిమా పూర్తిగా కొద్ది మంది పాత్ర ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.అయితే  ఈ సినిమాకి సక్సెస్ టక్‌ దక్కడంతో యూనిట్‌ సభ్యులు ఆనందంతో ఉన్నారు.కాగా  సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో అమల అక్కినేని ప్రముఖంగా కనిపిస్తున్నారు. 

ఇక దాంతో సినిమాలో ఆమెది చాలా పెద్ద పాత్ర అయి ఉంటుందని అంత అనుకుంటున్నారు. అయితే కానీ సినిమా విడుదల తర్వాత ఆమెది గెస్ట్ ఆర్టిస్ట్ కి మించి కాస్త ఎక్కువ ఉంది అంతే అంటూ కొందరు పెద విరుస్తున్నారు. అయితే  ఇక చిన్న పాత్ర అయినా కూడా సినిమా లో ఆమె పాత్ర అత్యంత ప్రభావశీలమైన పాత్ర.. కీలకమైన పాత్ర అనడంలో సందేహం లేదు.అయితే తనకు అప్పగించిన పాత్రకు పూర్తి న్యాయం చేసి అమల అక్కినేని సినిమాకు అదనపు హంగులను తీర్చిదిద్దింది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఇక  విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకే ఒక్క జీవితం సినిమాకు అమల అక్కినేని తీసుకున్నది కేవలం పాతిక లక్షల రూపాయలు..

అవును ఒక స్టార్ హీరో భార్య, ఇద్దరు స్టార్ హీరోల తల్లి అయిన అమల అక్కినేని చిన్న పారితోషికం కు సినిమా చేసేందుకు ఒప్పుకోవడం నిజంగా విడ్డూరం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.  అమల అక్కినేని పారితోషికం కోసం సినిమా చేసే రకం కాదు.. ఆమె నటిగా తనను తాను సంతృప్తి పరచుకోవడం కోసం ఒక మంచి కథ మరియు ఒక మంచి పాత్ర తన వద్దకు వచ్చింది అనే ఉద్దేశంతో తక్కువైనా చిన్న పాత్ర అయినా ఒకే ఒక జీవితం సినిమా లో నటించింది అంటూ అక్కినేని అభిమానులు మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: