ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా లేవీ కూడా ప్రేక్షకులను అలరించలేదనే చెప్పాలి..గత రెండు సంవత్సరాలుగా వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతో నిరాశపరిచింది. ఆ విధంగా రోజు రోజు కు వారిలో ఎంతో నిరాశ నిస్పృహలు కమ్ముకుంటున్న వేళ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమా లో అలియా భట్ హీరోయిన్ గా నటించింది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేరే లెవెల్ లో ప్రేక్షకులను అలరించింది అని చెప్పవచ్చు. రెండు భాషల్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజుకు గాను 3.68Cr రాబట్టి బ్రహ్మాస్త్రం చాలా రోజుల తర్వాత ఓ బాలీవుడ్ సినిమాలా సత్తా చాటింది. అలాగే ఈ సినిమా కు రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా ఈ సినిమా కు 2.62Cr కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే ఈ సినిమా ను ఏ స్థాయి లో ప్రేక్షకులు అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా బాగుండడం దానికి తోడు మొదటి రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఈ సినిమాకు ఇంతటి స్థాయి లో కలిసొచ్చింది.

మరి రాబోయే రోజులలో ఈ సినిమా ఇంకా ఎన్ని కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. విడుదలకు ముందు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల వరకు బిజినెస్ చేసింది బ్రహ్మాస్త్రం. అప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. అయితే మొదట్లో కొంత నెగెటివ్ టాక్ రావడం సినిమా ను దెబ్బ తీస్తుందేమో నాని అందరు సందేహించారు. ఫైనల్ గా 5.50Cr బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని రంగంలోకి దిగిన ఈ సినిమా రెండు రోజుల్లోనే లాభాల బాటలో అడుగుపెట్టింది. మరి సౌత్ లో చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: