సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)ను దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు.2012 వ సంవత్సరం నుండి ప్రతీ ఏడాది అంగరంగ వైభవంగా ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు.గత తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ఈ వేడుకల 10వ ఎడిషన్ కార్యక్రమం ముగిసింది.సైమా-2022 అవార్డ్స్ వేడుకలకు ఈసారి బెంగళూరు వేదికైంది. సెప్టెంబర్ 10 - 11 తేదీలలో రెండు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించారు. తొలి రోజు తెలుగు కన్నడ చిత్రాలకు.. రెండో రోజు తమిళ మలయాళ భాషల సినిమాలకు అవార్డులు ప్రధానం చేశారు.తెలుగులో 'పుష్ప' సినిమా అత్యధిక విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం - ఉత్తమ దర్శకుడు - ఉత్తమ నటుడు - ఉత్తమ సహాయ నటుడు - ఉత్తమ సంగీత దర్శకుడు - ఉత్తమ గీత రచయిత కేటగిరీలలో అవార్డ్స్ వచ్చాయి.అయితే ముఖ్య విభాగాల్లో 'అఖండ' 'లవ్ స్టొరీ' సినిమాలకు అవార్డ్స్ దక్కకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాకు గానూ బెస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి ఇంకా వస్తున్నాయి.'లవ్ స్టోరీ' సినిమాలో అత్యుత్తమ నటన ప్రదర్శన కనబరిచిన సాయి పల్లవి ని కాదని పూజా హెగ్డే ని బెస్ట్ యాక్ట్రెస్ గా ప్రకటించడం ఏంటని సైమాపై నెటిజన్లు మండిపడుతూ సైమాని పూజా హెగ్డేని ట్రోల్స్ చేస్తున్నారు.


అదే విధంగా 'అఖండ' సినిమాలో అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ కు అవార్డ్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు.అంతేకాదు ముందుగా సాయి పల్లవినే ఉత్తమ నటిగా ఎంపిక చేసినప్పటికీ.. ఆమె సైమా ఈవెంట్ కు హాజరు కాలేదనే కారణంతో చివరి నిమిషంలో పూజా హెగ్డేకి ఇచ్చారని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. 'సైమా' వికీపీడియాలో సైతం బెస్ట్ యాక్ట్రెస్ గా సాయి పల్లవి పేరు ఉండటాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.SIIMA అనేది ఓ కమర్షియల్ ఆర్గనైజేషన్ అని.. అవార్డుల ఫంక్షన్ కూడా వ్యాపారంగా భావిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చేస్తే శాటిలైట్ హక్కుల రూపంలో డబ్బులు వస్తాయి.. ఎవరు వస్తే క్రేజ్ వుంటుంది.. ఎవరికి ఇస్తే బజ్ వస్తుంది అన్నది చూసుకుని అవార్డులు అందిస్తారని అభిప్రాయ పడుతున్నారు.నిజానికి సైమా అవార్డ్స్ ఫంక్షన్ స్పాన్సర్ షిప్ లతో నడుస్తుంది. ఆన్ లైన్ ఓటింగ్ పెడుతున్నప్పటికీ.. ఆ ఈవెంట్ లో పాల్గొనడానికి ఇష్టపడే ప్రముఖులకే ఎక్కువగా అవార్డులు ఇవ్వబడుతుంటాయనే కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు సాయి పల్లవికి బదులుగా పూజా హెడ్జ్ కి ఇచ్చిన ఉత్తమ నటి అవార్డు గురించి ఫిల్మ్ నగర్ లో పెద్ద చర్చ జరుగుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: